Baba Ramdev : క్షమాపణలు మాకొద్దు.. మీపై చర్యలు తప్పవు.. రాందేవ్ బాబాకు ‘సుప్రీం’ షాక్

  • Written By:
  • Updated On - April 2, 2024 / 01:17 PM IST

Baba Ramdev: ప‌తంజ‌లి ఉత్ప‌త్తు(Patanjali product)ల గురించి త‌ప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev)ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ కేసులో ప్ర‌త్య‌క్షంగా ఇవాళ ఆయ‌న కోర్టుకు హాజ‌ర‌య్యారు. రాందేవ్‌(Ramdev), బాల‌కృష్ణ‌(Balakrishna)లు వ్య‌క్తిగ‌తం హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింద‌ని, ఆ ఆదేశాల ప్ర‌కారం ఆ ఇద్ద‌రూ కోర్టుకు వ‌చ్చిన‌ట్లు వాళ్ల త‌ర‌పు న్యాయ‌వాది వెల్ల‌డించారు. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ దాఖ‌లు చేసిన కేసులో రాందేవ్ బాబా క్షమాప‌ణ‌లు తెలిపారు. ప‌తంజ‌లి సంస్థ‌ ఉత్ప‌త్తుల‌కు గురించి మెడిక‌ల్ యాడ్స్ ఇవ్వ‌డాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఈ కేసులో గ‌తంలో ప‌తంజ‌లి ఎండీ ఆచార్య బాల‌కృష్ణ ప్ర‌త్య‌క్షంగా కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. జ‌స్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. వారం రోజుల్లోగా మెడిక‌ల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని బాబా రాందేవ్‌, బాల‌కృష్ణ‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

on WhatsApp. Click to Join.

ప్రకటనలకు సంబంధించి అన్ని హద్దులూ దాటారని సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్‌కు అల్లోపతిలో నివారణ లేదని పతంజలి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా కళ్లు మూసుకుందని ప్రశ్నించింది. ఈ కేసులో రామ్​దేవ్​, బాలకృష్ణ ఒక వారంలోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పింది.

Read Also: AP : జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు – సునీత

కాగా, టీవీ, పత్రికల్లో వెంటనే యాడ్స్ ను ఆపేయాలంటూ ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ పై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.