Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి భారీ ఆదాయం వస్తోంది. ఆదాయాన్ని ఆర్జించే విషయంలో షిర్డీ ఆలయం, వైష్ణోదేవి ఆలయాలను అయోధ్య రామాలయం దాటేసింది. ఆ వివరాలు చూద్దాం..
Also Read :US Seal Vs Laden: లాడెన్‌ను కడతేర్చిన అమెరికా సీల్.. ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!
మహాకుంభ మేళా ప్రారంభం అయ్యాక..
స్వర్ణదేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలను మించిన రీతిలో అయోధ్య రామ మందిరానికి కానుకలు వస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో అయోధ్య రామాలయానికి కానుకలు, విరాళాల రూపంలో దాదాపు రూ. 700 కోట్లు అందాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం మహాకుంభ మేళా జరుగుతోంది. అక్కడి త్రివేణీ సంగమంలో రోజూ లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానాలు చేసిన అనంతరం రోజూ లక్షలాది మంది భక్తులు అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నారు. దీంతో రామమందిరం ఆదాయం అమాంతం పెరిగిపోయింది. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మహాకుంభ మేళా ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయోధ్య రామాలయానికి రూ. 15 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో దేశంలో అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న టాప్-10 ఆలయాల జాబితాలో అయోధ్య మూడో స్థానానికి చేరుకుంది. దానికి ఏడాదిలో రూ.700 కోట్ల ఆదాయం వచ్చింది. షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల ఆదాయం, వైష్ణోదేవి ఆలయానికి ఏటా రూ. 400 కోట్ల ఆదాయం వస్తోంది.
Also Read :Kashi Temple : ప్రయాగ్‌రాజ్ టు కాశీ.. విశ్వనాథుడి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ
దర్శన వేళల్లో మార్పులు
భక్తుల రద్దీ నేపథ్యంలో అయోధ్య రామయ్య(Ayodhya Ram Mandir) దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయోధ్య రామమందిరాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచనున్నారు.మొన్నటి వరకు ఆలయాన్ని ఉదయం 7 గంటలకు తెరిచేవారు. ఇప్పుడు సాధారణ ప్రజల దర్శనం కోసం ఓ గంట ముందే తెరుస్తున్నారు. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున మహాకుంభ మేళా ముగుస్తుంది. అప్పటివరకు అయోధ్యకు భక్తుల తాకిడి కొనసాగనుంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు 53 కోట్ల మంది భక్తులు వచ్చారు.