Congress : కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. మొదటి నుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించనివిధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Read Also: Household Budget : ‘ఇంటి బడ్జెట్’ పై కేంద్రమంత్రి పెమ్మసాని భార్య సూచనలు..
ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. అయినా చైనా నుంచి ఏమి ముప్పుందో నాకు అర్థం కావట్లేదు. అమెరికా చైనాను తరచూ శత్రువుగా పేర్కొంటూ.. భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోంది. చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉంది. మనం అవలంబిస్తున్న ఆ విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తోంది. భారత్‌కు సరైన మద్దతు దక్కట్లేదు. ఇప్పటికైనా భారత్ తన వైఖరిని మార్చుకోవాలి. ఇది కేవలం చైనా విషయంలోనే కాదు అన్నారు.
ఇక, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువగా ఉంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలోఉంచుకొని మనం ప్రవర్తించాలి అని పిట్రోడా అన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు ఒకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇందులోభాగంగా ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్‌ను పెంచుకుంటూ.. అవసరమైన సమయంలో సహకరించుకోవాలని అన్నారు. అభివృద్ధిలో వెనకబడి ఉన్న దేశాలు వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. పేద దేశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తోంది. ఇలాంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా ఎక్కువగా ఉంటోందన్నారు.