Lord Krishna Incarnation : ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరిన విద్యావేత్త అవధ్ ఓఝా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను శ్రీకృష్ణుడి అవతారంతో పోల్చారు. “అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా దేవుడే. ఆయన కృష్ణుడి అవతారమని నేను ఇదివరకే చెప్పాను. ఎవరైనా సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పుడల్లా.. పేదల పెన్నిధిగా మారడానికి ప్రయత్నించినప్పుడల్లా.. కంసుడి లాంటి సామాజిక దురాచారాలు అతడితో విభేదిస్తాయి. విరోధిస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు కూడా జైలులోనే పుట్టాడని మనం గుర్తుంచుకోవాలి’’ అని ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవధ్ ఓఝా(Lord Krishna Incarnation) వ్యాఖ్యానించారు. సమాజంలోని పేద వర్గాల కోసం అరవింద్ కేజ్రీవాల్ పనిచేయడం కంసుడి లాంటి సామాజిక దురాచారాలకు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు.
Also Read :Allu Arjun : చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ .. పోలీసులు అడిగే అవకాశమున్న ప్రశ్నలివీ
‘‘అరవింద్ కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలోని పేద, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి జరిగింది. ఢిల్లీ లాంటి పాలనను యావత్ దేశం కోరుకుంటోంది. 2029లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి అవుతారని అందరూ భయాందోళనలకు గురవుతున్నారు. కేజ్రీవాల్ భగవానుడు (దేవుడు) అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఢిల్లీలో ఆయన ఉచితంగా విద్యను అందించాడు’’ అని అవధ్ ఓఝా కొనియాడారు. 2025 సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అవధ్ ఓఝాకు పట్పర్‌గంజ్ అసెంబ్లీ టికెట్‌ను కేజ్రీవాల్ కేటాయించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పోటీ చేశారు. ఈసారి జంగ్‌పురా స్థానం నుంచి మనీశ్ పోటీ చేస్తున్నారు.
Also Read :Lawrence Bishnoi : అమెరికాలో డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ హత్య.. లారెన్స్ గ్యాంగ్ ఎందుకీ మర్డర్ చేసింది ?
అవధ్ ఓఝా ఎవరు?
- అవధ్ ఓఝా ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందినవారు.
- ఆయన సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇస్తుంటారు.
- ఓఝా వీడియోలు యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాయి.
- రాజకీయాలు, జీవితం గురించి ఆయన చేసిన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- డిసెంబరు నెల ప్రారంభంలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమక్షంలో ఆప్‌లో అవధ్ ఓఝా చేరారు .