ED Team Attacked in Delhi : సైబర్ నేరాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసుపై ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ బృందంపై దుండగులు కుర్చీలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఈడీ అడిషనల్ డైరెక్టర్‌కు గాయాలయ్యాయి. నిందితులు అశోక్ శర్మ, అతని సోదరుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిషింగ్, క్యూఆర్ కోడ్, పార్ట్ టైమ్ జాబ్స్ వంటి వేలాది స్కామ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధుల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, సోదాలు కోనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈడీ అధికారులు నేడు దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఛార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బిజ్వాసన్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా, ఐదుగురు దుండగులు అధికారులపై దాడికి చేశారు. ఈక్రమంలోనే ఈడీ అడిషనల్ డైరెక్టర్‌కు గాయలయ్యాయి. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సైబర్ మోసాల ద్వారా సంపాదించిన డబ్బను దాదాపు 15వేల మ్యూల్ అకౌంట్స్ (మనీలాండరింగ్, తప్పుడు లావాదేవీలు వంటి చట్టవిరుద్ధమైన కార్యకాలపాలకు ఉపయోగించే ఖాతాలు) మళ్లించారని అధికారులు తెలిపారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ యొక్క హై-ఇంటెన్సిటీ యూనిట్ (HIU) ఈరోజు భారతదేశం అంతటా పనిచేస్తున్న భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న అగ్రశ్రేణి చార్టర్డ్ అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన శోధనలను ప్రారంభించింది. ఫిషింగ్ స్కామ్‌లు, క్యూఆర్ కోడ్ మోసం మరియు పార్ట్‌టైమ్ జాబ్ స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌క్రైమ్‌ల నుండి వచ్చిన అక్రమ నిధుల లాండరింగ్‌ను వెలికితీసిన దర్యాప్తును ఈ దాడులు అనుసరించాయి.. అని ఈడీ అధికారులు తెలిపారు.
Read Also: Threat call against PM Modi : ప్రధాని మోదీని చంపేస్తానంటూ మహిళ బెదిరింపు