Site icon HashtagU Telugu

Sunita Williams : అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్.. భూమికి తిరిగి వచ్చేదెప్పుడు ?

Sunita Williams

Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5వ తేదీ నుంచి  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్నారు. వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌, సునీతా విలియమ్స్ కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక‌ ద్వారా ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. 10 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో ఉండి.. అక్కడి నుంచి జూన్ 14న భూమికి వారిద్దరూ తిరిగి వస్తారని తొలుత ప్రకటించారు. అయితే  స్టార్‌లైనర్‌  వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్య ఏర్పడింది. దీంతో భూమిపై వ్యోమనౌక ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. జూన్‌ 26న సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం జరుగుతుందని నాసా ప్రకటించినప్పటికీ .. ఇప్పుడు మరోసారి ఆ తేదీని వాయిదా వేశారు. తదుపరిగా జులై 2న బోయింగ్ స్టార్‌లైనర్‌  వ్యోమనౌకలో సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్‌ విల్‌మోర్‌ కలిసి భూమికి చేరుకుంటారని నాసా అంచనా వేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Amarnath Yatra : గుడ్ న్యూస్.. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర