Arvind Kejriwal resigned from the post of CM: ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్…తన రాజీనామా లేఖను సమర్పించారు. అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు. అంతేకాకుండా తదుపరి ముఖ్యమంత్రిగా అతిషిని ఎన్నుకున్న పత్రాన్ని ఎల్జీకి అందజేశారు. ప్రమాణస్వీకారానికి సక్సేనా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది.
Read Also:Ajit Pawar : నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్ కీలక ప్రకటన
ఆప్ శాసనసభా పక్ష నేతగా అతిశిని ఎంపిక చేయడంతో.. అతిశి ఎంపికను లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలిపారు కేజ్రీవాల్. దీంతో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశి బాధ్యతలు చేపట్టనున్నారు. వారం రోజుల్లో ఆమె సీఎంగా ఛార్జ్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్ జైలుకెళ్లిన దగ్గర నుంచి ఢిల్లీ పాలనను ఆమెనే చూసుకుంది. దీంతో ఆమె వైపే కేజ్రీవాల్ మొగ్గుచూశారు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమె ఆధ్వర్యంలో ఎన్నికల్లోకి దిగనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి ఇంటికి చేరుకున్నాక.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త పొలిటికల్‌గా పెను సంచలనం సృష్టించింది. అన్న మాట ప్రకారం రాజీనామా చేయడం.. తదుపరి సీఎంగా అతిషికి అవకాశం కల్పించడం చకచకగా జరిగిపోయాయి.