Kejriwal resigns tomorrow: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రేపు(మంగళవారం) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పొలిటికల్‌గా తీవ్ర సంచలనం సృష్టించింది.
Read Also: Kaal Sarp Dosh: కాలసర్పం దోషం ఉన్నవారు కాళహస్తిలో పూజ చేయించాలా?
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన పలుమార్లు బెయిల్‌కు అప్లై చేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ వేడిలోనే ప్రభుత్వం రద్దైతే.. తనను కేంద్రం ఇబ్బంది పెట్టి.. జైల్లో పెట్టిన విషయం ప్రజలకు గుర్తుంటుందని కేజ్రీవాల్, ఆప్ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటే ఢిల్లీ ఎన్నికలు జరిగితే ప్రజల నుంచి సానుభూతి పొందవచ్చని ఆప్ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల వరకూ పార్టీ నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేయనున్నట్లు ఆదివారం కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజలు తనతోపాటు సిసోదియా విశ్వసనీయతకు సర్టిపికెట్ ఇచ్చిన తర్వాతే పదవుల్లోకి వస్తామని కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని ప్రకటించారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి పదవి రేసులో ఎవరున్నారనే అంశంపై చర్చకు తెరలేచింది. ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్, మంత్రులు అతీశీ, గోపాల్ రాయ్‌లలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. వీరితోపాటు మంత్రులు కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ పేర్లూ వినిపిస్తున్నాయి. దళిత నేతనుగానీ, మైనారిటీ నేతనుగానీ ముఖ్యమంత్రిని చేసే అవకాశమూ లేకపోలేదని సమాచారం.
Read Also:Stock Market Live: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్, అదానీ గ్రీన్ 7.59 శాతం పెరుగుదల