Site icon HashtagU Telugu

Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్

Lalu

Lalu

లోక్ సభ ఎన్నికల వేళ బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు భారీ షాక్ తగిలింది. 30 ఏళ్ల నాటి అక్రమ ఆయుధాల కొనుగోలు కేసు (Arms Act case)లో ఆయనకు గ్వాలియర్ కోర్టు (Gwalior Court) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాణా కుంభకోణం కేసులో బెయిల్ ఫై ఉన్న ఆయనకు ఇప్పుడు అరెస్టు గండం పొంచి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్‌ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. వీరిలో 6 మందిపై విచారణ కొనసాగుతుండగా, ఇద్దరు మృతి చెందగా, 14 మంది పరారీలో ఉన్నారు. మరి ఈ కేసులో యాదవ్ ను అరెస్ట్ చేస్తారా..? లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Read Also : Pushpa 2 : కౌంట్ డౌన్ పోస్టర్ తో పూనకాలు స్టార్ట్ చేసిన పుష్ప టీం