900 Tourists: మంచులో చిక్కుకున్న 900 మంది యాత్రికులు.. ఎక్కడంటే..?

సిక్కిం (Sikkim)లో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, సోమ్‌గో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్‌టక్ వైపు శనివారం సాయంత్రం బయల్దేరిన 89 వాహనాల్లో సుమారు 900 మంది పర్యాటకులు (900 Tourists) దట్టమైన మంచులో చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు.

  • Written By:
  • Publish Date - March 12, 2023 / 06:21 AM IST

సిక్కిం (Sikkim)లో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, సోమ్‌గో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్‌టక్ వైపు శనివారం సాయంత్రం బయల్దేరిన 89 వాహనాల్లో సుమారు 900 మంది పర్యాటకులు (900 Tourists) దట్టమైన మంచులో చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్మీ సాయంతో వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సిక్కింలో కురుస్తున్న మంచు కారణంగా దాదాపు 900 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ మేరకు పోలీసులు శనివారం సమాచారం అందించారు. శనివారం సాయంత్రం నాథులా, సోమ్‌గో సరస్సుల నుండి సిక్కిం రాజధానికి తిరిగి వస్తున్న దాదాపు 900 మంది పర్యాటకులు భారీ మంచు కురుస్తున్న కారణంగా దారిలో చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. ఈ పర్యాటకులను కాపాడేందుకు సైన్యం సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Also Read: Kavitha vs ED: ముగిసిన కవిత ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని నోటీసులు

ఆర్మీ సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని, మొత్తం 89 వాహనాల్లో 15 వాహనాలను బయటకు తీశామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మంచును క్రమంగా రోడ్లపై నుంచి తొలగిస్తున్నామని, తరలించిన వాహనాలను 46 కిలోమీటర్ల దూరంలోని గ్యాంగ్‌టక్‌కు పంపామని ఆయన చెప్పారు. కొంతమంది పర్యాటకులు ఆర్మీ క్యాంపులో రాత్రి అక్కడే ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. చిక్కుకుపోయిన పర్యాటకులకు అన్ని విధాలా సాయం చేస్తామని సైన్యం హామీ ఇచ్చింది. తూర్పు సిక్కింలో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా నాథులా, సోమ్‌గో సరస్సుకు సంబంధించిన పాస్‌ల జారీని ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది.