70 Terrorists : చొరబాటుకు 70 మంది ఉగ్రవాదులు రెడీ : కశ్మీర్ డీజీపీ

కశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద 70 మంది పాక్ ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని జమ్మూకశ్మీర్ డీజీపీ రష్మీ రంజన్ స్వైన్ తెలిపారు.

  • Written By:
  • Updated On - June 2, 2024 / 02:36 PM IST

70 Terrorists : కశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద 70 మంది పాక్ ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని జమ్మూకశ్మీర్ డీజీపీ రష్మీ రంజన్ స్వైన్ తెలిపారు. పాక్ ఉగ్రవాదులంతా ఐదారు బృందాలుగా ఏర్పడి కశ్మీర్‌లో వేర్వేరు చోట్ల దాడులు చేయడానికి చాలాకాలంగా ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు.  ఏ సమయంలోనైనా పాక్ ఉగ్రమూకలు ఎల్‌ఓసీ భారత సైన్యంపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు. దేశంలో విధ్వంసం క్రియేట్ చేయడమే ఆ ఉగ్రవాదుల(70 Terrorists) లక్ష్యమన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఓ వైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలకు ఉపాధి కరువైంది. దీన్ని కూడా అక్కడి ఉగ్రవాద సంస్థలు  ఆసరాగా చేసుకుంటున్నాయి. పాక్‌లోని నిరుపేద యువతను ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ చేసుకొని ఉగ్రవాద శిక్షణ అందిస్తున్నాయి. అలాంటి ఉగ్రమూకలనే కశ్మీర్‌లోకి చొరబడేందుకు పాకిస్తాన్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మే 27న కశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Bhaichung Bhutia : భైచుంగ్ భూటియా ఓటమి.. సిక్కింలో ఎస్‌కేఎం విజయం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) తమ భూభాగం కాదని పాకిస్తాన్ అంగీకరించింది. అది విదేశీ భూభాగమని, దానిపై పాకిస్థాన్‌కు అధికార పరిధి లేదని తాజాగా ఇస్లామాబాద్‌ హైకోర్టుకు స్పష్టం చేసింది. కశ్మీరీ కవి, జర్నలిస్ట్ అహ్మద్‌ ఫర్హాద్‌ షా కిడ్నాప్‌ కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో పాక్‌ అదనపు అటార్నీ జనరల్‌ ఈ ప్రకటన చేశారు. గత నెల 15న రావల్పిండిలో  ఫర్హాద్ షాను ఆయన ఇంటి వద్ద పాక్ నిఘా వర్గాలు అపహరించాయి. అనంతరం  పీఓకేకు తరలించాయి. దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టు‌లో అహ్మద్‌ ఫర్హాద్‌ షా భార్య పిటిషన్ వేసింది. దీంతో దీనిపై విచారణ జరుగుతోంది. శుక్రవారం నాటి విచారణలో భాగంగా ఫర్హాద్‌ షాను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని జస్టిస్‌ మొహిసిన్ అఖ్తర్ కయానీ ఆదేశించారు. దీనికి అటార్నీ జనరల్‌ బదులిస్తూ.. ఫర్హాద్‌ షా పీవోకేలో పోలీసుల కస్టడీలో ఉన్నారని తెలిపారు. కశ్మీర్‌ ప్రత్యేక రాజ్యాంగం, కోర్టులు కలిగిన విదేశీ భూభాగమని, అక్కడ పాక్‌ చట్టాలు చెల్లుబాటు కాబోవని ఆయన పేర్కొన్నారు.

Also Read : Spirituality : ఆధ్యాత్మికత అంటే ఏమిటి.. మీకు తెలుసా..?