Anushka Sharma: కోర్టు మెట్లెక్కిన అనుష్క శర్మ.. కారణమిదే..?

విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం సినిమా కాదు లీగల్. నటి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2012-13, 2013-2014 సంవత్సరాలకు పన్ను రికవరీ కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసును అనుష్క సవాలు చేసింది.

  • Written By:
  • Publish Date - January 13, 2023 / 06:45 AM IST

విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం సినిమా కాదు లీగల్. నటి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2012-13, 2013-2014 సంవత్సరాలకు పన్ను రికవరీ కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసును అనుష్క సవాలు చేసింది. కేసు విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై మూడు వారాల్లోగా స్పందించాలని సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ను కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో గత విచారణలో కోర్టు అనుష్క శర్మను మందలించింది. ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని తాము ఎప్పుడూ వినలేదని, చూడలేదని కోర్టు పేర్కొంది. నటి స్వయంగా ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేకపోయిందని కోర్టు.. అనుష్క శర్మ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. కోర్టు మందలించడంతో నటి లాయర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకుంది. స్వయంగా కొత్త పిటిషన్ దాఖలు చేసింది.

అనుష్క యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాతలు లేదా ఈవెంట్ నిర్వాహకులతో త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఆర్టిస్ట్‌గా తన హోదాలో ఏదైనా ఉత్పత్తి ప్రమోషన్ లేదా ఈవెంట్‌లో పాల్గొంటానని పిటిషన్‌లో పేర్కొంది. అయితే కేటాయించిన అధికారి సినిమాపై కాకుండా ఉత్పత్తి ప్రచారం, అవార్డు ఫంక్షన్‌లో యాంకరింగ్‌పై సేల్స్ టాక్స్ విధించారు. తన ప్రదర్శన హక్కులను బదిలీ చేసినట్లు పన్ను శాఖ అంగీకరించిందని నటి అప్పీల్‌లో పేర్కొంది.

Also Read: Sharad Yadav Passes Away: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

వివిధ సందర్భాల్లో నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు నటిగా సినిమాలతోపాటు, కొన్ని అవార్డు కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబులో పన్ను చెల్లించాలంటే ఎలాగని ఆమె ప్రశ్నించారు. అమ్మకపు పన్ను శాఖ 2012-13లో రూ.1.2 కోట్ల వడ్డీతో కలిపి రూ.12.3 కోట్లుగా నిర్ణయించగా, 2013-14 సంవత్సరానికి దాదాపు రూ.17 కోట్ల విక్రయ పన్ను రూ.1.6 కోట్లుగా ఉంది.

ఏదైనా సినిమా లేదా వీడియో కాపీరైట్ ఎల్లప్పుడూ దాని సృష్టికర్త లేదా నిర్మాతపై ఉంటుందని నటి తన పిటిషన్‌లో పేర్కొంది. తనకు కాపీరైట్‌లు కూడా లేనప్పుడు వాటిని ఎవరికైనా ఎలా బదిలీ చేస్తారని పిటిషనర్‌ అన్నారు. వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్‌ తనకు రావని నిర్మాతకే ఉంటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీడియోలు విక్రయించినట్లు సరైన నిర్ధారణ లేకుండా పన్నులు ఎలా విధిస్తారని? ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. నటులకు వర్తించే శ్లాబులోనే పన్ను వేయాలని అనుష్క శర్మ పిటిషన్‌లో కోరారు.