Anurag Thakur : ఆప్ నేత‌ల ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన అనురాగ్ ఠాకూర్

  న్యూఢిల్లీ : లిక్క‌ర్ స్కామ్‌(Liquor scam)లో అరెస్ట‌యిన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలు నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతార‌ని ఆప్ నేత‌లు(AAP leaders) చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Union Minister Anurag Thakur) స్పందించారు. ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాస్వామ్యానికి అవ‌మాన‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అర‌వింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతార‌ని చెబుతున్నారు..ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు, చ‌ట్టానికి, ప్ర‌జాస్వామ్యానికి అవ‌మాన‌క‌ర‌మ‌ని అన్నారు. We’re now on WhatsApp. Click […]

Published By: HashtagU Telugu Desk
Anurag Thakur

Anurag Thakur

 

న్యూఢిల్లీ : లిక్క‌ర్ స్కామ్‌(Liquor scam)లో అరెస్ట‌యిన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలు నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతార‌ని ఆప్ నేత‌లు(AAP leaders) చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Union Minister Anurag Thakur) స్పందించారు. ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాస్వామ్యానికి అవ‌మాన‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అర‌వింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతార‌ని చెబుతున్నారు..ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు, చ‌ట్టానికి, ప్ర‌జాస్వామ్యానికి అవ‌మాన‌క‌ర‌మ‌ని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుతూ.. సోనియా గాంధీని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేసే పార్టీ 9 స‌మన్లు జారీ చేసినా ఈడీ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకాక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఎందుకు ద‌ర్యాప్తు నుంచి త‌ప్పించుకు తిరుగుతున్నారు..ఈ లిక్క‌ర్ కుంభ‌కోణంలో అంతా బ‌య‌ట‌ప‌డింద‌ని అన్నారు. ఢిల్లీ నూత‌న మద్యం విధానం మెరుగైన‌దే అయితే దాన్ని ఎందుకు వెన‌క్కి తీసుకున్నార‌ని బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధూరీ ఆప్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

read also: BRS Party : మ‌రో రెండు పార్ల‌మెంట్ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్

ఎక్సైజ్ పాల‌సీ స‌రైంది కాద‌ని తాను అర‌వింద్ కేజ్రీవాల్‌తో చెప్పాన‌ని, ఈ పాల‌సీతో ప్ర‌భుత్వానికి రూ. 3000 కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు. ఇక అర‌విద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఎప్ప‌టికీ కొన‌సాగుతార‌ని ఢిల్లీ మంత్రి అతిషి స్ప‌ష్టం చేశారు. జైలు నుంచే ఆయ‌న పాల‌న న‌డిపిస్తార‌ని చెప్పారు. కేజ్రీవాల్ దోషిగా తేల‌లేద‌ని, ఆయ‌న ఢిల్లీ సీఎంగా ఉంటార‌ని తెలిపారు.

  Last Updated: 22 Mar 2024, 02:33 PM IST