Site icon HashtagU Telugu

Anjaneya Temples: కర్ణాటక అంతటా ఆంజనేయ ఆలయాలు నిర్మిస్తాం

Anjaneya Temples Will Be Built All Over Karnataka

Anjaneya Temples Will Be Built All Over Karnataka

Anjaneya Temples : తాము అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని హనుమాన్ దేవాలయాలను నిర్మిస్తామని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం హామీ ఇచ్చారు. ఆంజనేయ ఆలయాల (Anjaneya Temples) అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తామని చెప్పారు. అంజనాద్రి కొండ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని, దాని పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. హనుమంతుడు చెప్పిన సూత్రాలు, విలువల గురించి యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు.

ఎన్నికల్లో గెలిస్తే భజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలను బ్యాన్ చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించడంపై స్వయంగా ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భగా స్పందించారు. బజ్ రంగ్ బలిని లాక్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధం అవుతొందని ప్రధానమంత్రి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో హనుమాన్ దేవాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామంటూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రకటన చేయడం గమనార్హం.

Also Read:  Active Internet Users: 75.9 కోట్ల యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్