Site icon HashtagU Telugu

IIT Madras: మద్రాస్ ఐఐటీలో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య

Suicide

Deadbody Imresizer

మద్రాస్‌ (Madras)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)కి చెందిన మరో విద్యార్థి మంగళవారం (మార్చి 14) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థిని పుష్పక్‌గా గుర్తించారు. విద్యార్థి ఆంధ్రప్రదేశ్ నివాసి. పుష్పక్‌ ఇక్కడ B.Tech మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని పుష్పక్‌ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెలలో కూడా ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో ఒకరు మరణించారు.

గత నెల 14వ తేదీన కూడా ఐఐటీ మద్రాస్‌లో రెండు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మరో విద్యార్థి విష మాత్రలు తాగాడు. మాత్రలు వేసుకున్న మరో విద్యార్థిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

గత నెలలో ఐఐటీ మద్రాసులో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి మాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో ఉరివేసుకుని మృతి చెందిన విద్యార్థి మహారాష్ట్ర వాసి. అతడిని 27 ఏళ్ల స్టీఫెన్ సన్నీగా గుర్తించారు. మరోవైపు, ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన రెండో విద్యార్థిని కర్ణాటకకు చెందిన బి. వివేక్‌గా గుర్తించారు. అతని వయస్సు 22 సంవత్సరాలు.

Also Read: Internet: ఇంటర్నెట్ లో కిమ్ గురించి వెతికి ప్రాణాలు విడిచిన గూఢచారి.. అసలేం జరిగిందంటే?

ఈ ఇద్దరి విద్యార్థులను తలుపులు పగులగొట్టి బయటకు తీశారని పోలీసులు తెలిపారు. స్టీఫెన్ తన గదిలోకి వెళ్లడం చూసిన కొందరు స్నేహితులు అతని గది తలుపు తట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ సమాచారం హాస్టల్ వార్డెన్‌కు అందించారు. తన గది తలుపులు పగలగొట్టి చూడగా స్టీఫెన్ ఉరివేసుకుని కనిపించాడు. అదే సమయంలో మరో విద్యార్థి వివేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు కొన్ని రోజులు క్లాసుకు కూడా హాజరుకాలేదు. దీంతో అతని స్నేహితులు వివేక్‌ను కలవడానికి అతని రూంకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండడం చూసి తలుపులు తట్టారు. కానీ సమాధానం రాలేదు. ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వడం లేదు. ఇనిస్టిట్యూట్‌లోని అధికారులు తలుపులు పగులగొట్టి తెరిచి చూడగా అతను గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. సరైన సమయంలో ఆస్ప్రతికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.