Site icon HashtagU Telugu

Amul Milk: పాల ధరలను మరోసారి పెంచిన అమూల్‌

Amul Milk

Amul

దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ కీలక నిర్ణయం. శుక్రవారం నుంచి అమూల్ పాలు (Amul Milk) లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్ గోల్డ్ పాలు లీటరు రూ. 66, అమూల్ తాజా పాలు లీటరు రూ.54, అమూల్ ఆవు పాలు లీటరుపై రూ.56 చెల్లించాల్సి ఉంటుంది. ఇక అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరు రూ.70కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.

శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల (Amul Milk) ధరల జాబితాను గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేల్స్ సీనియర్ మేనేజర్ ప్రకాష్ ఔటే విడుదల చేశారు. కాగా, గతంలో అమూల్ 2022లో పాల ధరను మూడుసార్లు పెంచిన విషయం తెలిసిందే. గతేడాది మార్చి, ఆగస్టు, అక్టోబర్‌లలో పాలధరను పెంచింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా పాల ధరను పెంచినట్లు కంపెనీ తెలిపింది. గతంలో సాధారణంగా లీటరుకు రూ.2 పెంచగా.. ఈసారి ఏకంగా మూడు రూపాయలు పెంచేసింది.

Also Read:  Singapore CJ: సుప్రీం కోర్టులో ఈరోజు ఆసక్తికర సన్నివేశం.. సుప్రీం కోర్టులో సింగపూర్ సీజే