Site icon HashtagU Telugu

Amit Shah : నక్సలిజం కొనసాగడానికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పే కారణం

There is no truth in the opposition's allegations.. This provision also applies to Modi: Amit Shah

There is no truth in the opposition's allegations.. This provision also applies to Modi: Amit Shah

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఇలా పేర్కొన్నారు. గిరిజనులు మావోయిస్టుల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సల్వా జుడుం వ్యవస్థను రద్దు చేసే తీర్పు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఇచ్చారని, ఆ తీర్పు వల్లే దేశంలో నక్సలిజం మరో రెండు దశాబ్దాల పాటు కొనసాగిందని అమిత్‌ షా ఆరోపించారు. “జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నక్సల్‌ అనుకూలమని నేను ఎక్కడా అనలేదు. కానీ ఆదివాసీల ఆత్మరక్షణకు ఉన్న ఒక పెద్ద సాధనాన్ని ఆయన సమాప్తం చేశారు. దాని ప్రభావం దేశంపై తీవ్రమైంది. నక్సలిజం చరిత్రలో మరో రెండు దశాబ్దాలు సాగడానికి ఇదే ప్రధాన కారణం” అని అన్నారు.

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? దాని ల‌క్ష‌ణాలు ఇవేనా?

ఆ తీర్పు వల్లే భద్రతా దళాలు బలహీనమయ్యాయని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. “నక్సల్స్‌ విధ్వంసం చేసిన పాఠశాల భవనాల్లో సీఆర్‌పీఎఫ్, ఇతర బలగాలు ఉండగా, ఆ ఉత్తర్వులతో వారిని అక్కడి నుంచి బయటికి పంపేశారు. దాంతో ఆ సమయంలో భద్రతా దళాలపై అనేక దాడులు జరిగాయి. ఆ తీర్పుతో మావోయిస్టులకు రక్షణ లభించింది. ఇది సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా ఉంది. దేశభద్రతపై ఎంపీలు ఆలోచించాలి” అని ఆయన స్పష్టం చేశారు.ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా నిలిచిన రాధాకృష్ణన్‌ విషయానికొస్తే, ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉండటం మైనస్‌ కాదన్నారు. “తమిళనాడు ఎన్నికల్లో ఖాతా తెరవడానికే ఆయనను ఎంపిక చేశారనడం అసత్యం. అలాంటి ఉద్దేశం మాకు లేదు” అని చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ రాజీనామా విషయంలోనూ అమిత్‌ షా స్పందించారు. ఆయన పదవి నుంచి తప్పుకోవడానికి అనారోగ్యమే ప్రధాన కారణమని, వేరే ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.

India- Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మధ్య మూడు మహాపోర్లు ఖాయమా?