UPSC – AI: నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అలర్ట్ అయింది. తాము నిర్వహించే పరీక్షల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఆధారిత సీసీటీవీ నిఘా వ్యవస్థను వినియోగించాలని నిర్ణయించింది. పరీక్షా కేంద్రాల్లో అధునాతన నిఘా సేవలను అందించడానికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ జూన్ 3నే టెండరును విడుదల చేసింది. ఆసక్తి కలిగిన సంస్థలు జూలై 7న మధ్యాహ్నం 1 గంటలలోగా బిడ్లను దాఖలు చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఏఐ సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉండాలనే మార్గదర్శకాలను టెండరు కాపీలో యూపీఎస్సీ(UPSC – AI) స్పష్టంగా పొందుపరిచింది. దాని ప్రకారం.. యూపీఎస్సీ పరీక్షల నిఘా సేవలకు ఎంపికయ్యే సంస్థ ప్రతి పరీక్షా గదిలో 1 చొప్పున ఏఐ సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయాలి. ప్రతి పరీక్షా గదిలో సగటున 24 మంది అభ్యర్థులు ఉంటారని యూపీఎస్సీ వెల్లడించింది. ఎగ్జామ్ సెంటర్ ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్, కంట్రోల్ రూమ్‌లో తగిన సంఖ్యలో సీసీటీవీ కలర్ కెమెరాలను ఏర్పాటు చేయాలి. పరీక్ష జరిగే గదిలో అనుమానిత కదలికలున్నా.. ఇన్విజిలేటర్ నిర్లిప్తంగా ఉండిపోయినా ఏఐ సీసీ కెమెరాలు రికార్డు చేసి ఎగ్జామ్ కంట్రోల్ రూంకు మెసేజ్ పంపుతాయి. పరీక్ష జరగడానికి గంట ముందు లేదా గంట తర్వాత పరీక్ష గదిలో అనుమానిత కదలికలు జరిగినా సీసీ కెమెరాలు రికార్డు చేసి ఎగ్జామ్ కంట్రోల్ రూంకు సెండ్ చేస్తాయి. సీసీ కెమెరాలను వేటితోనైనా కప్పినా, వాటిపై రంగు పూసినా ఎగ్జామ్ కంట్రోల్ రూంకు సమాచారం వెళ్లిపోతుంది. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకోనున్నారు. వారి ముఖ గుర్తింపు స్కానర్లు, ఈ-అడ్మిట్ కార్డ్‌ల క్యూఆర్ కోడ్ స్కానింగ్ మెషీన్లు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు.
Also Read :Maternity Leaves : కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై వారికీ మెటర్నిటీ లీవ్స్
యూపీఎస్సీ సంస్థ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ కేటగిరీ పోస్టులను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తుంటుంది. దేశంలోని దాదాపు 80 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతుంటాయి. ఏటా దాదాపు 25 లక్షల మంది వివిధ యూపీఎస్సీ పరీక్షలు రాస్తుంటారు.