Site icon HashtagU Telugu

Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..

Jairam Ramesh And Mamata

Jairam Ramesh And Mamata

Lok Sabha Polls 2024: రానున్న లోకసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ఇతరత్రా పార్టీలను కలుపుకుని ముందుకెళుతున్నాయి. అయితే ఇండియా కూటమికి బీటలు పడినట్లుగా తెలుస్తుంది. కూటమిలో నుంచి కొందరు నేతలు బయటకు వస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ ప్రతిపక్ష కూటమి ఇండియాలో భాగమేనని, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి రావాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు సాధిస్తుందా అన్న అనుమానం వ్యక్తం చేశారు సీఎం మమతా బెనర్జీ. ఇదే విషయంపై జైరాం రమేష్ మాట్లాడుతూ…మమతా బెనర్జీ ఇప్పటికీ 27 పార్టీల సమూహం అయిన ఇండియా కూటమిలో భాగమని భావిస్తున్నామని అన్నారు. అయితే రాజకీయంగా ఎవరి ఆలోచనల వారిదని చెప్పారు జైరాం రమేష్.

బిజెపితో పోరాడటమే మా ప్రాధాన్యత, మనందరం కలిస్తే బీజేపీని గద్దె దించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాట్నా, బెంగళూరు, ముంబయిలో మేం కలిసి ఉన్నాం. అయితే ఇండియా కూటమి ఉంచి మొదట శివసేన విడిపోయింది, ఆ తర్వాత నితీశ్‌ కుమార్‌, ఇప్పుడు మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని రమేష్ చెప్పారు. ఇది స్థానిక స్థాయి ఎన్నికలు కాదని హితవు పలికారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్.

నిన్న కోల్‌కతాలో జరిగిన ధర్నాలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ…కాంగ్రెస్ 300 స్థానాల్లో పోటీ చేయాలని నేను ప్రతిపాదించాను, కానీ వారు పట్టించుకోలేదు. 300 స్థానాల్లో పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయో లేదో నాకు అనుమానం అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Hungry Cheetah : OG కాస్త హంగ్రీ చీతా గా మారబోతుందా..?