Ship Hijack : సముద్ర దొంగలు పరార్.. హైజాక్ అయిన నౌకను రక్షించిన నేవీ

Ship Hijack :  సోమాలియా సముద్ర తీరం సమీపంలో సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌక ‘ఎంవీ లీలా నార్‌ఫోల్క్‌’‌లోని 15 మంది భారతీయులను భారత నేవీ రక్షించి దేశానికి తీసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - January 6, 2024 / 07:36 AM IST

Ship Hijack :  సోమాలియా సముద్ర తీరం సమీపంలో సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌక ‘ఎంవీ లీలా నార్‌ఫోల్క్‌’‌లోని 15 మంది భారతీయులను భారత నేవీ రక్షించి దేశానికి తీసుకొచ్చింది. ఈనౌకలో ఆరుగురు విదేశీయులు కూడా ఉన్నట్లు గుర్తించారు. లైబీరియా జెండాతో బ్రెజిల్ నుంచి బహ్రెయిన్‌కు వెళ్తున్న ఈ నౌకను గురువారం సాయంత్రం సోమాలియా తీరంలో సముద్ర దొంగలు చుట్టుముట్టి హైజాక్ చేశారు. ఐదు నుంచి ఆరుగురు గుర్తు తెలియని దుండగులు నౌకలోకి ప్రవేశించారు. ఈవిషయం తెలియగానే భారత నౌకాదళం తమ యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై, ఆర్మీ పెట్రోలింగ్ హెలికాప్టర్లను  అక్కడికి పంపింది. తొలుత హైజాక్ అయిన నౌకలోని భారత సిబ్బందితో భారత నేవీ కమ్యూనికేషన్‌ను నెలకొల్పింది. అనంతరం నౌకను ఫాలో అవుతూ.. అందులోని సిబ్బంది ద్వారా హైజాకర్లతో మాట్లాడింది. నౌకను వదిలి వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు  ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ నౌకను(Ship Hijack) భారత నేవీ నలుమూలల నుంచి చుట్టుముడుతోందనే విషయాన్ని తెలిపింది. దీంతో భయపడిన సముద్రపు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నౌకలో ఉన్న 21 మందిని భారత నేవీ రక్షించి ఇండియా తీరానికి తీసుకొచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

అటు ఎర్ర సముద్రం.. ఇటు అరేబియా సముద్రం

ఇజ్రాయెల్ -గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి సముద్రాల్లో వాణిజ్యం చాలా రిస్కీగా మారింది. ఇప్పటికే యెమన్ హౌతీల దాడులతో ఎర్ర సముద్రం అట్టుడుకుతోంది.  ఇటీవల కాలంలో అరేబియా సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపైనా దాడులు పెరుగుతున్నాయి. అంతకుముందు లైబీరియా జెండాతో వెళ్తున్న నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై కూడా దాడి జరిగింది. ఆ నౌకలో 21 మంది భారతీయ పౌరులున్నారు. డ్రోన్ల ద్వారా ఈ నౌకపై దాడి జరిపినట్లు రిపోర్టులు వచ్చాయి. అంతకుముందు ఆఫ్రికా దేశం గబాన్ జెండాతో వెళ్తున్న ఎంవీ. సాయి బాబా నౌకపైనా దాడి జరిగింది. ఇది చమురుతో వెళ్తుంది.ఈ నౌక భారత్‌ గుండా వస్తుండగా దాడి జరిగింది. దీనిలో 25 మంది నౌకా సిబ్బంది ఉన్నారు. వారందరూ భారతీయులే. ఎంవీ కెమ్ ప్లూటోపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత అరేబియా సముద్రంలో వివిధ ప్రాంతాల్లో ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతా పేర్లతో మార్గ‌ద‌ర్శ‌క క్షిప‌ణి విధ్వంస‌కర నౌకలను మోహరించారు.ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండేలా వీటిని రూపొందించారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలకు చెందిన షిప్‌లను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు జరుపుతున్న సమయంలో అరేబియా సముద్రంలో భారత్ వైపుకి వచ్చే నౌకలపై కూడా దాడులు జరుగుతున్నాయి.

Also Read: Sesame Seeds – Periods : పీరియడ్స్ రెగ్యులర్ కావాలంటే ఇవి తినండి !