Site icon HashtagU Telugu

Baba Siddique : దారుణ హత్యకు గురైన బాబా సిద్దీఖ్ ఎవరు ?

Baba Siddique Ncp Maharashtra

Baba Siddique : బాబా సిద్దీఖ్ (66).. ఈయన మహారాష్ట్ర మాజీ మంత్రి. శనివారం రోజు ముంబైలో బాబా సిద్దీఖ్ దారుణ హత్య జరిగింది. ముంబైలోని తన కుమారుడు జీషాన్ ఆఫీసు వద్దకు చేరుకోగానే ఆయనపై నలుగురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. నాలుగు బుల్లెట్లు ఛాతీలోకి చొచ్చుకుపోయాయి. నగరంలోని లీలావతి ఆస్పత్రికి తరలించేలోపే బాబా సిద్దీఖ్ చనిపోయారు. రంజాన్ మాసంలో ముంబై నగరంలో బాబా సిద్దీఖ్ ఇచ్చే ఇఫ్తార్ పార్టీలు చాలా ఫేమస్. ఎందుకంటే ఆ ఇఫ్తార్ పార్టీలకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ (Baba Siddique) వంటి టాప్ బాలీవుడ్ స్టార్లు హాజరవుతుంటారు.  షారుఖ్, సల్మాన్‌లకు బాబా సిద్దీఖ్ చాలా క్లోజ్ అని చెబుతుంటారు. కొన్ని నెలల క్రితమే నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఇంతలోనే వారికి సన్నిహితంగా మెలిగే బాబా సిద్దీఖ్ హత్య జరగడం ముంబైలో కలకలం రేపింది. వాస్తవానికి 15 రోజుల క్రితమే సిద్దీఖ్‌కు హత్య బెదిరింపు వచ్చింది. ఈవిషయాన్ని ఆయన పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించారు.

Also Read :Professor Saibaba: హైద‌రాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

Also Read :Sensitive Teeth: ఏ వ‌య‌సులో దంతాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. నిర్మూల‌న‌కు ఇంటి చిట్కాలివే..!