Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 04:09 PM IST

 

Akhilesh Yadav : అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌(Akhilesh Yadav)కు సీబీఐ సమన్లు జారీ(CBI summons issued) చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్‌ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో జరిగిన అక్రమ మైనింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి.

నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, మోసం, నేరం వంటి నేరాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2012-2016 మధ్య కాలంలో హమీర్‌పూర్‌లో అక్రమ మైనింగ్‌కు అనుమతించిన పలువురు అధికారులతో పాటు 11 మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది టెండర్ విధానాన్ని అనుసరించకుండా… చట్టవిరుద్ధంగా లీజులు మంజూరు చేశారని, అప్పటికే ఉన్న లీజులను పునరుద్ధరించారని విచారణలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అఖిలేష్ యాదవ్‌ను సాక్షిగా సీబీఐ విచారణకు పిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ(bjp) ప్రయత్నాలు చేస్తోందని అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటు వేసిన రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు గాను బీజేపీ 8, ఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో బీజేపీ ఎనిమిదో రాజ్యసభ సీటును కూడా గెలుచుకుంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ సైట్‌లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012- 2013 జూన్‌ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్‌ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది.

read also : YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్