Sunetra vs Supriya : శరద్ పవార్‌కు అగ్నిపరీక్ష.. శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు

Sunetra vs Supriya : శరద్ పవార్ కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో వెరీ స్పెషల్.

Published By: HashtagU Telugu Desk
Sunetra Vs Supriya

Sunetra Vs Supriya

Sunetra vs Supriya : శరద్ పవార్ కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో వెరీ స్పెషల్. ఇప్పుడు ఈ బలమైన పొలిటికల్ ఫ్యామిలీ చీలిపోయింది. మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు దెబ్బకు శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ రెండు ముక్కలైంది. అసలు పార్టీ మేనల్లుడికే దక్కింది. దీంతో తన వర్గానికి మరో కొత్త పేరును శరద్ పవార్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో యావత్ మహారాష్ట్రలో అజిత్ పవార్ పార్టీ, శరద్ పవార్ పార్టీ బలంగా ఢీకొంటున్నాయి. వీటన్నింటిలోనూ బారామతి లోక్‌సభ స్థానం చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడి నుంచి 1996 నుంచి శరద్ పవార్ పార్టీ గెలుస్తూ వస్తోంది. 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బారామతి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే(Sunetra vs Supriya) గెలిచారు. ఈసారి బారామతిలో ఆమెకు ఎదురుగాలి వీస్తోంది. ఎందుకంటే.. ఇన్నాళ్లూ సుప్రియకు బలంగా నిలుస్తూ వచ్చిన అజిత్ పవార్ ఇప్పుడు దూరమయ్యారు. ఆయన ఏకంగా తన భార్య సునేత్రా పవార్‌ను బారామతి నుంచి బరిలోకి దింపారు.   ఈ పోటీకి సంబంధించిన మరిన్ని వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

వదినా మరదళ్లు ఢీ

  • బారామతి లోక్‌సభ స్థానంలో ఎన్​సీపీ (ఎస్పీ) తరఫున సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ మేనల్లుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ ఇక్కడి నుంచి ఎన్​సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
  • ఈ ఎన్నికల్లో సూలే ఓడితే, ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది.
  • పార్టీ శ్రేణులపై శరద్ పవార్ పట్టు కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది.
  • ఈసారి  కుమార్తె విజయం కోసం శరద్‌ పవార్‌ శ్రమిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Also Read :MP Candidates Qualifications : లోక్‌‌సభ అభ్యర్థుల విద్యార్హతల చిట్టా ఇదిగో..

ఛత్రపతి శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు

కొల్హాపుర్‌‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీమంత్‌ శాహూ ఛత్రపతి మహరాజ్‌ బరిలో నిలిచారు. ఈయన ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరు.  ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీలు ఈ స్థానంలో శ్రీమంత్‌ శాహూకు మద్దతు ప్రకటించాయి. ఈ స్థానం నుంచి సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ సంజయ్‌ మండ్లిక్‌‌కు టికెట్‌ ఇచ్చింది.

Also Read :Hirsutism: స్త్రీల ముఖంపై గ‌డ్డం, మీసాలు క‌నిపించ‌డానికి గ‌ల కార‌ణాలివే..?

  • మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
  • మొత్తం 11 స్థానాలకు మే7న పోలింగ్ జరగనుంది. బరిలో మొత్తం 258 అభ్యర్థులు నిలిచారు.
  • మెజార్టీ సీట్లలో ప్రధాన పోటీ మహాయుతి (ఎన్​డీఏ), మహా వికాస్‌ అఘాడీ (ఇండియా) మధ్యే ఉంది.
  Last Updated: 28 Apr 2024, 01:27 PM IST