Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
నిన్న ఉదయం విమాన ప్రమాదం జరిగింది. రన్ వే పైకి దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు దర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
