Site icon HashtagU Telugu

IAF Chief : భారత వాయుసేన తదుపరి చీఫ్‌గా అమర్‌ప్రీత్ సింగ్‌ : రక్షణశాఖ

IAF Chief AP Singh

IAF Chief AP Singh

IAF Chief : ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్‌‌ను భారత వాయుసేన తదుపరి అధిపతిగా నియమిస్తున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ఈనెల 30న వాయుసేన చీఫ్‌గా ఆయన బాధ్యతలు చేపడతారని తెలిపింది. ప్రస్తుతం వాయుసేన అధిపతిగా(IAF Chief) వ్యవహరిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలోనే ముగియనున్నందున ఈవిషయంపై రక్షణశాఖ ప్రకటన విడుదల చేసింది.

Also Read :Polar Bear : ధ్రువపు ఎలుగుబంటు.. ఓ బామ్మ.. పోలీసులు.. ఏమైందంటే.. ?

Also Read :Lebanon Pager Blasts : లెబనాన్‌‌లో పేజర్లు పేలిన కేసులో కేరళవాసి పేరు.. ఏం చేశాడంటే.. ?

ఇటీవలే పెద్ద ప్రమాదం.. 

ఇటీవలే  బీఎస్ఎఫ్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భద్రత కోసం వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 7 బస్సులు కాన్వాయ్‌గా బయలుదేరగా మార్గం మధ్యలో బ్రెల్ గ్రామం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న 40 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది.