ఎయిర్ ఇండియా (Air India)కు వారంలోనే రెండు జరిమానాలు విధించడం వల్ల ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మద్యం అందించడంపై సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులలో ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం సేవించారని భావిస్తే.. వారికి ఆపైన సెర్వ్ చేసేందుకు నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమాన ప్రయాణ సమయంలో మద్యం అందించే విధానాన్ని సవరించింది. విమానంలో జరుగుతున్న సంఘటనల మధ్య ఎయిర్‌లైన్ ఈ చర్య తీసుకుంది.
గత కొన్ని రోజులుగా రెండు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణీకులు అనుచితంగా ప్రవర్తించినందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జరిమానా విధించింది. ఇతర విమానయాన సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులకు అనుగుణంగా US నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (NRA) మార్గదర్శకాల ఆధారంగా విమానంలో ఆల్కహాల్ అందించే ప్రస్తుత విధానాన్ని సమీక్షించిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: Ruturaj Gaikwad: టీ20ల ముంగిట భారత్ కు షాక్.. గాయం కారణంగా ఓపెనర్ గైక్వాడ్ టీ20లకు దూరం
ఎయిర్ ఇండియా సవరించిన విధానంలో ఏముంది..?
– సవరించిన విధానం ప్రకారం.. సిబ్బంది సర్వ్ చేస్తే తప్ప ప్రయాణికులు మద్యం సేవించకూడదు.
– తమ సొంతంగా మద్యం సేవించే ప్రయాణికులను గుర్తించేందుకు సిబ్బంది తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి.
– ఆల్కహాల్ పానీయాలు సముచితమైన, సురక్షితమైన పద్ధతిలో అందించబడాలి.
– ఇందులో మళ్లీ ప్రయాణికులకు మద్యం అందించడానికి నిరాకరించడం కూడా ఉంది.
