Site icon HashtagU Telugu

Air India: ఇంజిన్‌లో అగ్గి రవ్వలు.. వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం

Air India

Air India

Air India: న్యూఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ2913)లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆదివారం ఉదయం విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన వెంటనే కుడి ఇంజిన్‌లో మంటలు రేగినట్లు కాక్‌పిట్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్‌కు సమాచారం అందించగా, ఆయన అప్రమత్తమై విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ స్వయంగా వెల్లడించింది.

Kaleshwaram Commission : అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ప్రస్తుతం, సాంకేతిక నిపుణుల బృందం ఆ విమానంలోని ఇంజిన్‌ను పరిశీలిస్తోంది. అదే సమయంలో, ఈ విమానంలో ప్రయాణించాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులందరినీ మరో విమానంలో ఇండోర్‌కు పంపిస్తున్నట్లు పేర్కొంది. ఈ సంఘటనపై ఎయిర్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి కూడా సమాచారం అందించినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, తమ విమాన సర్వీసులను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నడుపుతోందని తెలిపింది. ఏ మాత్రం చిన్న సాంకేతిక లోపం కనిపించినా, వెంటనే చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా సంస్థ వివరించింది.

Aarogyasri : అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ – నెట్వర్క్ ఆస్పత్రులు

Exit mobile version