MSP For Crops : దీపావళి పండుగ సమీపించిన వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. పలు రబీ పంటలకు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పీ)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాము ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు 2025-26 మార్కెటింగ్ సీజన్‌లో అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని పెంచేందుకుగానూ రూ.35వేల కోట్లతో ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ స్కీంను తెచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. రబీ సీజన్‌కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీని అందించేందుకు కేంద్రం(MSP For Crops) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పంటలకు మద్దతు ధరల పెంపు ఇలా..
- క్వింటాలు గోధుమల కనీస మద్దతు ధరను తాజాగా రూ.150 మేర పెంచారు. దీంతో ఆ రేటు రూ.2275 నుంచి రూ.2425కి చేరింది.
- క్వింటాలు బార్లీ ధర రూ.1850 నుంచి రూ.1980కి పెరిగింది.
- క్వింటాలు పెసర్ల ధర రూ. 5440 నుంచి రూ.5650కి పెరిగింది.
- క్వింటాలు శెనగల ధర రూ.6425 నుంచి రూ.6700కు పెరిగింది.
- క్వింటాలు ఆవాల ధర రూ.5650 నుంచి రూ.5950కు పెరిగింది.
- క్వింటాలు పొద్దుతిరుగుడు ధర రూ.5800 నుంచి రూ.5940కి పెరిగింది.
Also Read :Sakina Itoo : 20సార్లు హత్యాయత్నాలు తూచ్.. కశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా
ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సర్కారు శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3శాతం పెంచింది. దీంతో వారికి అందుతున్న డీఏ 50శాతం నుంచి 53 శాతానికి చేరింది. ఈ ఏడాది జులై 1 నుంచే దీన్ని లెక్కకట్టి కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనాలను అందించనున్నారు. ఈనిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.9448 కోట్ల భారం పడే అవకాశం ఉంది.