12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

నిన్న సాయంత్రం పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు 2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.

Published By: HashtagU Telugu Desk
PM Modi

PM Modi

PM Modi: గత 12 ఏళ్లలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక కీలక బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. ప్రతిపక్షాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. బిల్లు వీగిపోయిన తర్వాత బీజేపీ ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండించింది. మరుసటి రోజే అంటే ఏప్రిల్ 18న ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాల చర్యపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం వారు చేసిన పెద్ద తప్పిదమని, భవిష్యత్తులో దీనివల్ల వారు రాజకీయంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ వైఖరికి ప్రతిపక్షాలు భారీ రాజకీయ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

Also Read: IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

మహిళల పట్ల ప్రతిపక్షాల ఆలోచనా విధానం ప్రతికూలంగా ఉందనే సందేశాన్ని దేశంలోని ప్రతి గ్రామానికి చేరవేయాలని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు తమ ఈ చర్యను సమర్థించుకోవడానికి, తప్పును కప్పిపుచ్చుకోవడానికి రకరకాల మార్గాలను వెతుకుతున్నాయని ఆయన విమర్శించారు. కాగా ప్రతిపక్షాలు మొదటి నుండి ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. దీనిపై పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించాయి.

బిల్లు ఎలా వీగిపోయింది?

నిన్న సాయంత్రం పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు 2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందాలంటే రెండొంతుల మెజారిటీ అవసరం. ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి కనీసం 352 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఆ మ్యాజిక్ ఫిగర్ అందకపోవడంతో బిల్లు వీగిపోయింది.

  Last Updated: 18 Apr 2026, 02:17 PM IST