Ayushman Bharat : ప్రధాని మోడీ ఈరోజు (మంగళవారం) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రధాని ఉపాధి మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఎంపికైన 51,000 మందికి పైగా అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..’ధన త్రయోదశి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. మరో రెండ్రోజుల్లో ప్రత్యేకమైన దీపావళి జరుపుకోబోతున్నాం. సూమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైనవేళ ఇది తొలి దీపావళి. ఈ ప్రత్యేక వేళకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉంటున్నాం. నేడు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ దీపావళి కోసం ఎన్నో తరాలు గడచిపోయాయని, లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, హింసను భరించారని ప్రధాని మోడీ అన్నారు. అటువంటి ప్రత్యేకమైన, ప్రత్యేకమైన, గొప్ప దీపావళిని చూసేందుకు మనమందరం చాలా అదృష్టవంతులం అన్నారు.
కాగా, దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో రోజ్‌గార్ మేళాలను నిర్వహించారు. వీటిల్లో వివిధ మంత్రిత్వశాఖల్లో నియామకాలను చేపట్టారు. ఈ ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వారందరికి ‘కర్మయోగి ప్రారంభ్’ విధానం కింద శిక్షణ ఇస్తున్నారు. ఐజీవోటీ కర్మయోగి పోర్టల్‌లో దాదాపు 1,400 కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. దీనినుంచి వారికి వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్పుతారు. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో ఈ మేళాలను నిర్వహించారు. వైజాగ్‌లో వీఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. 155 మందికి ఆయన నియామక పత్రాలు అందించారు.
ఇకపోతే..ఈ పథకంలో ముందు ప్రకటించిన విధంగానే 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం తరపున ఇన్యూరెన్స్ కల్పించనుంది. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్ అందించనుంది. ఈ పథకం వల్ల 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది వరకు లబ్ధి పొందనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి సీనియర్ సిటిజన్స్‌కి లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది.