Richest MLA : మనదేశంలోనే సంపన్న ఎమ్మెల్యే ఎవరో తెలుసా ? పరాగ్ షా. ఈయన మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉన్న ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. రూ.3,400 కోట్ల ఆస్తులతో మన దేశంలోనే సంపన్న ఎమ్మెల్యేగా పరాగ్ షా నిలిచారు. రెండో ప్లేస్‌లో కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఈయనకు రూ.1413 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈమేరకు దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తిపాస్తుల వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADS) ఒక నివేదికను విడుదల చేసింది. ఈ లిస్టులో చివరి స్థానంలో నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన వద్ద రూ.1700 మాత్రమే ఉన్నాయి.
Also Read :Betting Apps Scam : బెట్టింగ్ యాప్స్.. ఎలా దగా చేస్తున్నాయి ? చట్టాలతో కంట్రోల్ చేయలేమా ?
తెలుగు రాష్ట్రాల చిట్టా..
ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలోని టాప్-10 సంపన్న ఎమ్మెల్యేల లిస్టులో(Richest MLA) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలోని టాప్-20 ఎమ్మెల్యేలలో ఏడుగురు ఏపీ వారే. ఇందులో ఏపీ మంత్రి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలక్రిష్ణ కూడా ఉన్నారు. ఏడీఆర్ ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ రూ.931 కోట్లు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ రూ.757 కోట్లు. టీడీపీ ఎమ్మెల్యే పి.నారాయణ ఆస్తుల విలువ రూ.824 కోట్లు. టీడీపీ ఎమ్మెల్యే వి.ప్రశాంతి రెడ్డి ఆస్తుల విలువ రూ.716 కోట్లు.ఏపీలోని 174 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి విలువ రూ.11,323 కోట్లు. ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి విలువ రూ.65 కోట్లు.
Also Read :Telangana Budget 2025: తెలంగాణ అప్పులు, ఆదాయం.. చైనా ప్లస్ వన్ వ్యూహం
రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు
- కర్ణాటకలోని 223 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి విలువ రూ.14,179 కోట్లు.
- మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి విలువ రూ.12,424 కోట్లు.
- త్రిపురలోని 60 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి విలువ రూ.90 కోట్లు.
- మణిపూర్‌లోని 59 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి విలువ రూ.222 కోట్లు.
- పుదుచ్చేరిలోని 30 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి విలువ రూ.297 కోట్లు.