Aditya L1: చరిత్ర సృష్టించిన ఇస్రో .. హాలో ఆర్బిట్‌లోకి ఆదిత్య ఎల్‌-1

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్‌ మిషన్‌ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది

Aditya L1: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్‌ మిషన్‌ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది

2023లో భారత్ అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలను సాధించింది. ఈ ఏడాది ఎక్స్‌పోశాట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి అద్భుత శుభారంభం చేసింది. ఇప్పుడు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మరో మైలురాయిని చేరుకుంది. ఆదిత్య-ఎల్1 ఈ రోజు శనివారం తన గమ్యస్థానమైన ఎల్1 కి చేరుకుంటుందని ఇదివరకే ఇస్రో తెలిపింది. అంటే భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ సమీపంలోని కక్ష్యలో ఆదిత్య L1 చేరుకుంటుంది. ఈ పాయింట్ ని లాగ్రేంజ్ పాయింట్ 1 (Lagrange Point 1) గా పిలుస్తారు. L1 అనేది అంతరిక్షంలో సూర్యుడు మరియు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఒకేలా ఉండే ప్రదేశం. ఆ ప్రదేశంలో ఏదైనా వస్తువును ఎలాంటి శక్తి ప్రయోగం లేకుండా స్థిరంగా ఉంచవచ్చు. అందుకే అక్కడికి ఆదిత్య L1 పంపిస్తుంది. అక్కడికి వెళ్లిన ఆదిత్య L1 ఐదేళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.

ఆదిత్య-ఎల్1ని సెప్టెంబర్ 2న పీఎస్‌ఎల్‌వీ-సీ57లో ప్రయోగించారు. ఇప్పుడు ఆదిత్య L1 తన గమ్యస్థానానికి చేరుకుంది. 2024 జనవరి 6 సాయంత్రం లెగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న శూన్య కక్ష్యలోకి ఆదిత్య L1 ప్రవేశించనున్నట్లు ఇస్రో పేర్కొంది.ఇది సక్సెస్ అయితే సూర్యుడి మీద పరిశోధనలకు ప్రోబ్‌లను పంపించిన నాలుగో దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కుతుంది. ఆదిత్య లెగ్రాంజ్ పాయింట్ 1నుంచి సూర్యుని అధ్యయనం చేస్తుంది. సూర్యుడిని అధ్యయనం చేయడం ద్వారా నక్షత్రాల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

Also Read: #Thandel First Glimpse : తండేల్ నుండి ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది..