Hero Sriram: చెన్నైలో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో బాగా పేరుగాంచిన నటుడు శ్రీరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో శ్రీరామ్‌కు సంబంధం ఉన్నట్టు స్పష్టమైన తరువాత, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని ముందుగా అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించగా, డ్రగ్స్ వినియోగదారులలో శ్రీరామ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన నివాసంపై దాడిచేసిన పోలీసులు కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీరామ్‌ను తక్షణమే అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం చెన్నై నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు.
ఈ విచారణ అనంతరం శ్రీరామ్‌ను చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆయనను జూలై 7వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలపై మరింత సమాచారం రాబట్టేందుకు శ్రీరామ్‌ను కస్టడీలోకి తీసుకోవాలని నుంగంబాక్కం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయనను విచారిస్తే కోలీవుడ్‌కు చెందిన మరికొంత మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Murder: ప్రేమకు అడ్డుచెప్పిందని.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక