Prakash Raj Vs PM Modi: యాక్టర్ ప్రకాశ్‌రాజ్ మరోసారి తనదైన శైలిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీపైకి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇవాళ గుజరాత్‌లోని గిర్ అడవులను మోడీ సందర్శించడంపై ఆయన ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌ను కూడా ఒకసారి సందర్శించాలని ప్రధానమంత్రికి ప్రకాశ్ రాజ్ సూచించారు. మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఒకసారి స్వయంగా సమీక్షించాలని మోడీని ఆయన కోరారు. మణిపూర్‌లో హింసాకాండ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అక్కడికి ప్రధాని మోడీ వెళ్లలేదు. దీన్ని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ఈ సెటైరికల్ కామెంట్లు చేశారు.
ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ‘‘వావ్.. మీ ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి.. గ్రేట్ పిక్స్.. మీ ఫొటో షూట్ మణిపూర్‌లో కూడా ఉండాలని కోరుకుంటున్నా.. #జస్ట్ ఆస్కింగ్’’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Wowww.. so sweet of you .. great pics .. waiting for the photoshoot when you visit #Manipur too. #justasking https://t.co/piyihOdqJz
— Prakash Raj (@prakashraaj) March 3, 2025
Also Read :Hyderabad Tour : హైదరాబాద్ ఒకరోజు ఫుల్ టూర్.. ఛార్జీ రూ.430 మాత్రమే
ఆసియాటిక్ సింహాలను కెమెరాలో బంధించి..
ప్రధాని మోడీ ఇవాళ గిర్ అడవులను సందర్శించి, అక్కడి ఆసియాటిక్ సింహాలను తన కెమెరాలో బంధించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రకృతిపై మోడీకి(Prakash Raj Vs PM Modi) ఉన్న ప్రేమను, ఫోటోగ్రఫీపై ఆయనకు ఉన్న ఆసక్తిని ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి. గిర్ అడవులు ఆసియాటిక్ సింహాల ఏకైక సహజ నివాస స్థలం.
Also Read :Iron Rod Vs Infant: 30 రోజుల పసికందుకు ఇనుప చువ్వలతో 40 వాతలు.. ఏమైంది ?
ప్రకాశ్ రాజ్ పేరుతో తప్పుడు వార్తలు
ఇటీవలే ప్రకాశ్ రాజ్ పేరుతో ఒక వార్త వైరల్ అయింది. ‘‘ఇండోనేషియాలో 90 శాతం జనాభా ముస్లింలే. 2 శాతం మంది హిందువులు ఉన్నారు. 11 వేల దేవాలయాలు అక్కడ ఉన్నాయి. అయినా అక్కడ అల్లర్లు జరిగినట్టుగా, హింస జరిగినట్టుగా మేం ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లేదు’’ అని ప్రకాశ్ రాజ్ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం తప్పు అని ఫ్యాక్ట్ చెక్‌లో భాగంగా బూమ్ (BOOM) గుర్తించింది. ప్రకాష్ రాజ్ స్వయంగా ఒక పోస్ట్ ద్వారా ఈవిషయాన్ని ఖండించారని గుర్తు చేసింది.