AAP in Bihar: ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో తమ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆప్ బీహార్ గడ్డపై అడుగు పెట్టాలని భావిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మరియు పార్టీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సందీప్ పాఠక్ ఢిల్లీలో బీహార్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, బీహార్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అజేష్ యాదవ్, కో-ఇన్‌చార్జ్ అభినవ్ రాయ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీహార్‌లో పార్టీ సంస్థాగత విస్తరణపై పాఠక్ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.
దేశంలో మొత్తం ఎన్నికల్లో పోటీ చేయలేమని, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయగలమని ఆయన తెలిపారు. ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా ప్రవేశించడానికి అత్యంత ప్రత్యక్ష మార్గం ఏంటంటే.. జిల్లా పంచాయతీ, నగర పంచాయతీ మరియు కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు, ముందుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరని కార్యకర్తలతో చెప్పారు.
బీహార్‌లో మాకు సంస్థ నిర్మాణం లేకపోవచ్చు కానీ అక్కడ చాలా మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. బీహార్ దేశం మొత్తానికి రాజకీయాలు నేర్పుతుంది. బీహార్ ప్రజలకు రాజకీయం అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. బీహార్‌లో పదేళ్ల చిన్నారికి కూడా రాజకీయాల గురించి తెలుసని పాఠక్ ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: East Godavari : సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని చావబాదిన గ్రామ వాలంటీర్