Site icon HashtagU Telugu

Aadhaar Card:ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనా..?: కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

Indelible Ink

Aadhaar Not Mandatory For Voting, Ec Tells Tmc Delegation

 

 

Aadhaar Not Mandatory For Voting EC : ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలిపింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆపబోమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఏదైనా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించవచ్చని పేర్కొంది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

బంగాల్​ ప్రజల ఆధార్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేస్తోందని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే, డోలా సేన్, సాకేత్ గోఖలే, లోక్‌సభ ఎంపీలు ప్రతిమా మోండల్, సజ్దా అహ్మద్‌లతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ను కలిసింది. తమ రాష్ట్రంలో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్​పై వస్తున్న ఆరోపణలను లేవనెత్తింది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం టీఎంసీ బృందానికి హామీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

‘బంగాల్‌లో వేల మంది ప్రజల ఆధార్ కార్డులను చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా డీయాక్టివేట్ చేయడంపై మా ఆందోళనలను కేంద్రం ఎన్నికల సంఘం ముందు లేవనెత్తాం. రాష్ట్రంలో మోహరించిన కేంద్ర బలగాలు తమ పరిధిలో పని చేసేలా చూడాలని కోరాం. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు చట్టానికి అనుగుణంగా పనిచేసేలా ఆదేశాలివ్వాలని కోరాం.’ అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​ను కలిసిన అనంతరం రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే మీడియాతో చెప్పారు.

read also : TCongress: రూ.500 సబ్సిడీ సిలిండర్‌ అర్హులకు అందేనా.. పథకం అమలుపై ప్రశ్నలు