Site icon HashtagU Telugu

Aadhaar – Fingerprint : కేంద్రం శుభవార్త.. ‘ఆధార్‌’కు వేలిముద్ర అక్కర్లేదు

Payments Through Aadhaar

Aadhar

Aadhaar – Fingerprint : కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేలిముద్ర పడకపోయినా ఆధార్ కార్డును పొందొచ్చని ప్రకటించింది. వేళ్లు లేవని, వేలిముద్రలు సరిగ్గా పడటం లేదని కారణాలను చూపించి ప్రజలకు ఆధార్‌ కార్డు మంజూరును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసింది. వేలిముద్రలు పడనివారు ప్రత్యామ్నాయంగా ఐరిస్ ద్వారా ఆధార్ కార్డును పొందొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోమ్ పట్టణానికి చెందిన జోసిమల్ పి.జోస్ తనకు వేళ్లు లేకపోవడంతో ఆధార్‌లో పేరు నమోదు చేసుకోలేకపోతున్నారు. ఈవిషయాన్ని జోసిమల్ పి.జోస్ ఇటీవల కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు తెలియజేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి.. ‘‘మీరు ఐరిస్ ద్వారా ఆధార్ పొందొచ్చు’’ అని జోసిమల్ పి.జోస్‌కు  బదులిచ్చారు.ఇంకా ఎవరికైనా వేలిముద్రలు, ఐరిస్‌(Aadhaar – Fingerprint) రెండూ లేకుంటే..  అవి లేకుండానే ఆధార్ కోసం పేర్లను నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. అటువంటి వ్యక్తులు బయోమెట్రిక్ మినహాయింపు నమోదు మార్గదర్శకాల కింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలన్నారు. ఈ నిబంధనలను పాటించిన తర్వాత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సూపర్‌వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Also Read: Single KYC : ‘వన్ నేషన్.. వన్ కేవైసీ’.. త్వరలోనే మార్గదర్శకాలు !