Metro Train – Saree Stuck : మెట్రో రైలులో మహిళ చీర ఇరుక్కుపోయి ఏమైందంటే ?

Metro Train - Saree Stuck : ఓ మహిళ చీర మెట్రో ట్రైన్ డోర్‌లో ఇరుక్కుపోయింది.

Published By: HashtagU Telugu Desk
Hyderabad Metro

Hyderabad Metro

Metro Train – Saree Stuck : ఓ మహిళ చీర మెట్రో ట్రైన్ డోర్‌లో ఇరుక్కుపోయింది. అది గమనించకుండానే ఆమె రైలు నుంచి దిగిపోయింది. ఈక్రమంలో ట్రైన్‌ ముందుకు కదలడంతో..  ఒక్కసారిగా వెనక్కి లాగినట్టైంది. చీర ట్రైన్‌తో పాటు ముందుకు కదలడంతో.. ఆ మహిళ  ప్లాట్‌ఫామ్‌పైనే పడిపోయింది. కొంతదూరం వరకు ఆ ట్రైన్‌ ఆమెను లాక్కెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.  ప్రాణాలతో పోరాడిన బాధితురాలు చివరకు చనిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు నిలువలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీలోని ఇందర్‌లోక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ పేరు రీనా అని తెలిసింది. ఆమె భర్త ఏడేళ్ల క్రితం చనిపోయారు. కొడుకు, కూతురు ఉన్నారు. డిసెంబర్ 14న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూశాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. వెస్ట్‌ ఢిల్లీలోని నాంగ్లోయ్‌ నుంచి మోహన్‌ నగర్‌కు వెళ్తున్న మెట్రో రైలులో(Metro Train – Saree Stuck) రీనా ఎక్కిందని గుర్తించారు. కాసేపైతే రైలు దిగి తన కూతురిని కలిసేందుకు వెళ్తుందనగా.. ఆమె చీర మెట్రో రైలు డోర్లలో ఇరుక్కుపోవడం పెను విషాదానికి దారితీసింది.

  Last Updated: 17 Dec 2023, 02:08 PM IST