Three Senas Battle : మహారాష్ట్రలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రత్యేకించి ఈసారి ‘సేన’ పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ‘సేన’ పార్టీలు ఉన్నాయి. అవి.. శివసేన(ఏక్‌నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన. ఈ మూడు పార్టీలు కూడా ఒక అసెంబ్లీ స్థానంలో నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ఆ స్థానమే.. మాహిం. వివరాలివీ..
Also Read :Salman Khan : రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్.. కూరగాయల వ్యాపారి అరెస్ట్
సెంట్రల్ ముంబై పరిధిలోని మాహిం అసెంబ్లీ సీటు.. అవిభాజ్య శివసేన పార్టీకి కంచుకోట లాంటిది. ఇక్కడ కొన్ని దశాబ్దాల పాటు విజయపతాక ఎగురవేసిన రికార్డు అవిభాజ్య శివసేన పార్టీకి ఉంది. కానీ ఈసారి శివసేన(ఏక్‌నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనలు ఇక్కడ అభ్యర్థులను నిలిపాయి. ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని వ్యూహాలను రచిస్తున్నాయి. అభ్యర్థుల విషయానికి వస్తే.. మాహిం నుంచి ఈసారి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే కుమారుడు అమిత్ థాక్రే పోటీ చేస్తున్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ బరిలోకి దిగారు. ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన(Three Senas Battle) నుంచి మహేశ్ సావంత్ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ బలమైన అభ్యర్థులే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.
Also Read :BTech Management Seats : ఎంబీబీఎస్ తరహాలో బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు ?
మాహిం సీటు నుంచి అమిత్ థాక్రే పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. అయినప్పటికీ రాజ్ థాక్రే చరిష్మా ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. థాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం అమిత్‌కు అతిపెద్ద అడ్వాంటేజ్. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్‌కు కూడా విజయావకాశాలు ఎక్కువే ఉన్నాయి. అధికార పక్షం (షిండే శివసేన) అభ్యర్థి కావడం ఈయనకు అనుకూలంగా పరిణమించే ఛాన్స్ ఉంది. అమిత్ థాక్రే, సదా సర్వాంకర్‌ల మధ్య జరుగుతున్న పోటీ ఓట్లు చీలిపోయి తనకు ప్రయోజనం దక్కుతుందని.. తప్పకుండా గెలుస్తాననే విశ్వాసంతో ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన అభ్యర్థి మహేశ్ సావంత్ ఉన్నారు.