Three-Language Policy : ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలి..నాకు 8 భాషలు వచ్చు: సుధామూర్తి

పిల్లలు కూడా దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు అని సుధామూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. త్రిభాషా సూత్రాని కి మద్దతు పలికారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడం పిల్లలకే మంచిదన్నారు.

Published By: HashtagU Telugu Desk
A person should learn many languages..I know 8 languages: Sudha Murthy

A person should learn many languages..I know 8 languages: Sudha Murthy

Three-Language Policy : గత కొన్ని రోజులుగా జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ వితరణశీలి సుధామూర్తి దీనిపై మాట్లాడుతూ.. ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలని సూచిస్తాను. నాకు 7-8 భాషలు వచ్చు. నేర్చుకోవడాన్ని నేను చాలా ఇష్టపడతా. పిల్లలు కూడా దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు అని సుధామూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. త్రిభాషా సూత్రాని కి మద్దతు పలికారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడం పిల్లలకే మంచిదన్నారు.

Read Also: Mauritius : సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి: ప్రధాని

ఇటీవల ఈ త్రిభాషా సూత్రం కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం దీనిపై మాట్లాడుతూ.. . రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం కోసం తమిళం ఉండాలి. ఒకవేళ మూడో భాషను నేర్చుకోవాలంటే అది విద్యార్థుల అభీష్టానికి వదిలేయాలి. అంతేగానీ.. తప్పనిసరి అంటూ బలవంతంగా రుద్దకూడదు. కేంద్రం చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ద్విభాషా పద్ధతిపై తమిళనాడు చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచ శాస్త్ర, సాంకేతికత, వాణిజ్య విధానాలతో అనుసంధానం కోసం ఆంగ్లం నేర్చుకోవాలి అన్నారు. త్రిభాషా సూత్రం అమలుపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నవిషయం తెలిసిందే. ఇక, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. విద్యార్థులు చదువుకునే హక్కును హరించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. విద్యా విధానాల అమలు విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

Read Also: Yogi Adityanath: ‘‘ఇస్లాం పుట్టక ముందే ‘సంభాల్’.. 1526లో ఆలయాన్ని కూల్చేశారు’’

  Last Updated: 12 Mar 2025, 05:02 PM IST