Minior Girl : కోల్‌కతాలో మైనర్ బాలికపై మైన‌ర్ బాలుడు లైంగిక వేధింపులు.. పోలీసుల అదుపులో మైన‌ర్ బాలుడు

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల బాలికకు ప్రైవేట్

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 05:47 AM IST

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల బాలికకు ప్రైవేట్ పార్ట్స్‌లో లో తీవ్ర గాయాలయిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాలిక‌ను కోల్‌కతాలోని సేథ్ సుఖ్‌లాల్ కర్నానీ మెమోరియల్ హాస్పిటల్ (SSKM) ఆసుపత్రికి తరలించారు. ఉత్తర కోల్‌కతాలోని బాగ్ బజార్‌లోని హాస్టల్‌లో నివసిస్తున్న నిందితుడైన మైనర్ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు 14 రోజుల గృహ నిర్బంధానికి పంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైన‌ర్ బాలుడు వేసవి సెలవుల్లో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడని.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుటుంబ స్నేహితుడి కుమార్తె అయిన మైనర్ బాలికపై మైన‌ర్ బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీని తరువాత, బాధితురాలు అస్వస్థతకు గురైంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ వ‌ద్ద రక్తస్రావం ప్రారంభమయ్యాయని పోలీసులు తెలిపారు.

బాలిక‌ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బాలికను చికిత్స నిమిత్తం ఎంఆర్‌ బంగూర్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స అందిస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భవానీపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. తర్వాత, కోల్‌కతాలోని కస్బా పోలీస్ స్టేషన్‌లో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం,సెక్షన్‌లు 6, 10 కింద కేసు నమోదు చేశారు.. మైనర్ బాలుడిపై విచారణ ప్రారంభించిన పోలీసులు… అనంతరం నిందితుడిని పట్టుకుని కోల్‌కతాలోని జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. జువైనల్ జస్టిస్ బోర్డు .. నిందితుడైన మైన‌ర్ బాలుడిని జూన్ 9 వరకు ధృబాశ్రమం, అరియాదహలో హోమ్ రిమాండ్‌లో ఉంచాలని పోలీసులను ఆదేశించారు.