Site icon HashtagU Telugu

Attack : భారత్ సైన్యాన్ని చంపేందుకు భారీ ప్లాన్..తృటిలో తప్పించుకున్న సైన్యం

Terrorist House Security

Terrorist House Security

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు (Terrorists) భారత సైన్యాన్ని (Indian Army) లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడు జరిపే ప్రయత్నం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నిందితుడిగా ఉన్న లష్కరే తైబా ఉగ్రవాది ఆసిఫ్ షేక్ (Lashkar-e-Taiba terrorist Asif Sheikh) ఇంట్లో ఈ పేలుడు జరిగింది. భారత సైన్యం, భద్రతా బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో ఈ ఇంట్లోకి ప్రవేశించగానే పేలుడు పదార్థాలు కనపడటంతో వారు వెంటనే బయటకు వచ్చారు. క్షణాల వ్యవధిలోనే ఆ ఇల్లు పూర్తిగా పేలి పోయింది. కాసేపు అయితే మన సైన్యం ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ముందే పసిగట్టి బయటకు రావడం తో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

Pahalgam Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి

భద్రతా వర్గాల కథనం ప్రకారం.. ఆసిఫ్ షేక్ గతంలో పుల్వామా దాడిలో కూడా పాత్ర వహించినట్లు తెలుస్తోంది. అతను పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబాలో స్థానిక కమాండర్‌గా వ్యవహరిస్తూ, పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. సైనికులు అతని కోసం గాలింపు చేపట్టగా, అతని ఇంట్లో పేలుడు పదార్థాలతో ఏర్పాటు చేసిన ట్రాప్ గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ స్మార్ట్ స్పందన వల్లే పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. పేలుడు వీడియోలు చూస్తే దాని తీవ్రత ఎంతో స్పష్టమవుతుంది. ఇక మరోవైపు ఆసిఫ్ షేక్‌కు సన్నిహితుడిగా ఉన్న మరో లష్కరే ఉగ్రవాది ఆదిల్ ఠోకార్ ఇంటిని భారత సైన్యం ధ్వంసం చేసింది. బిజ్ బెహారాలో చోటు చేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో ఆదిల్ 2018లో పాకిస్తాన్ వెళ్లి ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ తీసుకుని తిరిగి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని ఇంటెలిజెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.