Sandhya Bazar : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సంధ్యా బజార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఫైరింజన్ల సాయంతో మంటలను అర్పుతున్నారు. మంటలను ఆర్పేందుకు మొత్తం ఆరు ఫైరింజన్లను వినియోగిస్తున్నారు.
కాగా, సంధ్యాబజార్‌లో వరుసగా దుకాణ సముదాయాలు ఉంటాయని, ఒక దుకాణంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనున్న దుకాణాలకు విస్తరించాయని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఇక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు లేదా మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం లేదని పోలీసు అధికారి తెలిపారు. అన్వర్ షా రోడ్డు సమీపంలోని సంధ్యా బజార్‌లో మధ్యాహ్నం 3.20 గంటలకు మంటలు చెలరేగాయి.
Read Also: Food Adulteration: ఆహార పదార్థాల కల్తీపై ప్రత్యేక నిఘా పెట్టాలి: మేయర్