మహిళల ఆర్థిక భద్రతను ప్రోత్సహించేందుకు 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Mahila Samman Savings Scheme) పథకాన్ని 2025, మార్చి 31నాటికి ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తేదీ తర్వాత కొత్త డిపాజిట్లు స్వీకరించబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మహిళల పొదుపు ప్రోత్సాహకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది.
Vinegar : వెనిగర్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
ఈ పథకంలో రెండు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి, సంవత్సానికి 7.5% వడ్డీ, రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవకాశం ఉండేది. కేవలం మహిళలు, బాలికలే దీని ద్వారా లాభం పొందేవారు. MSSC పథకం ముగియడంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి ఇతర ప్రభుత్వ పొదుపు పథకాలను మహిళలు పరిశీలించవచ్చు. PPFలో 7.1% వడ్డీ, SSYలో 8.2% వడ్డీ, NSCలో 7.7% వడ్డీ లభిస్తోంది.
MSSC ఖాతాదారులు ఒక సంవత్సరం తర్వాత 40% వరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఆరు నెలల తర్వాత ఖాతాను మూసివేయడానికీ అవకాశం ఉంది. అయితే 2% జరిమానా విధించబడుతుంది. దీంతో 7.5% వడ్డీకి బదులుగా 5.5% మాత్రమే లభిస్తుంది. ప్రాణాంతక వ్యాధులు, ఖాతాదారు మరణం వంటి పరిస్థితుల్లో జరిమానా లేకుండా మూసివేసే అవకాశం ఉంది. మహిళల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే ఈ పథకాన్ని రద్దు చేయడం కొంత అసంతృప్తికి కారణం అయ్యే అవకాశం ఉంది.