Site icon HashtagU Telugu

Diwali – 80 : ఆ 80 మంది జీవితాల్లో మూడేళ్ల తర్వాత దీపావళి

Diwali 80

Diwali 80

Diwali – 80 : వాళ్ల జీవితాలకు ఈరోజు నిజమైన దీపావళి.  ఎందుకంటే అక్రమ కేసులతో గత మూడేళ్లుగా వాళ్లంతా పాకిస్థాన్ జైళ్లలో మగ్గారు. గుజరాత్‌కు చెందిన 80 మంది మత్స్యకారులు ఎట్టకేలకు కరాచీలోని జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇవాళ  దీపావళి వేళ.. వీరంతా తమ కుటుంబాలను కలుసుకున్నారు. ఈసందర్భంగా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కరాచీలోని జైలు నుంచి వీరంతా గురువారం విడుదల కాగా, మరుసటి రోజు వీరిని తీసుకొచ్చి పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. అక్కడి నుంచి వారంతా రైలులో ప్రయాణించి గుజరాత్‌లోని వడోదరకు ఆదివారం చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో తమ సొంతూళ్లకు వెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

2020 సంవత్సరంలో గుజరాత్‌లోని సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులను పాకిస్థాన్‌కు చెందిన నౌకా దళాలు పట్టుకున్నాయి. మూడేళ్లుగా కరాచీలోని జైళ్లలో వారిని ఉంచారు. ఇందులో 80 మందిని గురువారం విడుదల చేశారు. వీరిలో 59 మంది గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాకు చెందిన వారు. 15 మంది ద్వారక, ఇద్దరు జామ్‌నగర్‌, ఒకరు అమ్రేలీ నివాసితులు. మరో ముగ్గురు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూకు చెందినవారు. మరో 200 మంది భారత మత్స్యకారులు పాకిస్థాన్‌ జైళ్లల్లో మగ్గుతున్నట్లు(Diwali – 80) సమాచారం.

Exit mobile version