Vehicle Falls Into Gorge : నదిలో పడిపోయిన టెంపో.. 8 మంది దుర్మరణం

22 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Vehicle Falls Into Gorge

Vehicle Falls Into Gorge

Vehicle Falls Into Gorge : 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తరాఖండ్‌‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న రిషికేశ్-బద్రీనాథ్ హైవే‌పై చోటుచేసుకుంది.  ఇవాళ ఉదయం 11.30 గంటలకు టెంపో ట్రావెలర్ ఘజియాబాద్ నుంచి చోప్టా నగరానికి వెళ్తుండగా.. రుద్రప్రయాగ్ సిటీ నుంచి ఒక చిన్న మలుపు తిరుగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం అదుపుతప్పి అలకనంద నదిలోకి పడిపోయింది.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఘటనలో వాహనంలోని మొత్తం 23 మందికిగానూ 8 మంది చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు పంపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో సమీపంలోని గుప్తకాశీ నుంచి హెలికాప్టర్‌ను రుద్రప్రయాగ్‌కు పంపారు. గాయపడిన నలుగురిని అక్కడి నుంచి  లికాప్టర్‌లో రిషికేష్ ఎయిమ్స్‌కు(Vehicle Falls Into Gorge) తరలించారు.

Also Read : PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్‌పై పీకే ఆగ్రహం

ప్రమాదం బారినపడిన టెంపోలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది ఢిల్లీ వాస్తవ్యులేనని తెలిసింది. ఘటన జరిగిన ప్రాంతం రుద్రప్రయాగ్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం జరిగిన చోట ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల స్పందన బృందం (SDRF) రెస్క్యూ వర్క్స్ నిర్వహించింది. ఈ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికార యంత్రాంగం, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈమేరకు సీఎం ధామి ఓ ట్వీట్ చేశారు. ప్రమాద ఘటనపై విచారణ నిర్వహించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు.

Also Read : Bajaj CNG Bike: బజాజ్ CNG బైక్ మరింత ఆలస్యం.. జూలై 17న విడుదల..!

  Last Updated: 15 Jun 2024, 02:55 PM IST