Site icon HashtagU Telugu

Assam : పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌

8 coaches of Agartala-Lokmanya Tilak Express derail in Assam

8 coaches of Agartala-Lokmanya Tilak Express derail in Assam

Lokmanya Tilak Express : అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 కోచ్‌లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. లండింగ్ డివిజన్‌లోని లుమ్‌డింగ్-బాదర్‌పూర్ హిల్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ ప్రమాదం గురించి తన అధికారిక సోషల్ హ్యాండిల్ ఎక్స్‌లో సమాచారం ఇచ్చారు.

ఈరోజు ఉదయం అగర్తల నుంచి బయలుదేరిన ముంబయి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3:55 గంటలకు అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే ప్రతినిధి తెలిపారు. రైలులోని పవర్ కార్, ఇంజన్ సహా 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టం లేదా తీవ్రమైన గాయాలవడం వంటివి సంభవించలేదు. రెస్క్యూ, పునరుద్ధరణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు లుమ్‌డింగ్ నుండి స్పాట్‌కు బయలుదేరారు. లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సింగిల్ లైన్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సింగిల్ లైన్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు సీపీఆర్వో తెలిపారు. దీనితో పాటు హెల్ప్‌లైన్ నంబర్లు 03674 263120, 03674 263126 జారీ చేశారు.

కాగా, యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌ సంఘటన స్థలానికి చేరుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైలు ఇంజిన్‌, ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు వివరించారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: Nawaz Sharif : ఈ పర్యటన భారత్‌-పాక్ మధ్య ఒక ఆరంభం: మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు