Navy Jobs : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ముంబైలోని ఆర్బీఐ సర్వీస్ బోర్డు 94 ఆఫీసర్ (గ్రేడ్-బి) పోస్టులను భర్తీ చేస్తోంది. వీటిలో 66 జనరల్ పోస్టులు, డీఈపీఆర్ పోస్టులు 21, డీఎస్‌ఐఎం పోస్టులు 07 ఉన్నాయి. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారికి ప్రయారిటీ ఉంటుంది. 21 నుంచి 30 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు(RBI Jobs) ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.55,200 నుంచి రూ.99,750 దాకా శాలరీ ఇస్తారు. ఆసక్తి, అర్హతలున్న వారు 2024 ఆగస్టు 16లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనే విడతల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join
భారత నౌకాదళం(Navy Jobs) గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 741 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. వీటిలో 444 ఫైర్‌మ్యాన్ పోస్టులు, 161 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కు సంబంధించిన 58 పోస్టులు, పెస్ట్ కంట్రోల్ వర్కర్ పోస్టులు 18 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టు (INCET-01/2024)తో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.ఈ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయినవారు ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్‌లుగా విధులు నిర్వర్తిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.
Also Read :Encounter In Kupwara: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!
సైంటిఫిక్ అసిస్టెంట్, ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లలోపు ఉండాలి.మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లలోపు ఉండాలి. పలు వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.295 చెల్లించాలి.మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.