Site icon HashtagU Telugu

Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

Mexico Bus Crash

Road accident

బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం రాత్రి కోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగ్రీ పెట్రోల్ పంపు సమీపంలో NH-81లో ట్రక్కు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ట్రక్కు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో మృతుల బంధువులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో వెనుక నుండి ఒక‌ ట్రక్కు త్రీవీలర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రక్కు ఆటోను ఢీకొని దాని మీదుగా వెళ్లడంతో ఆటో ముక్కలై ఆటోలో ఉన్న వారంతా మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలిక ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన‌వారు ఉన్నారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Also Read: Vistara Flight: ఎయిర్ విస్తారా ఫ్లైట్‌కు తప్పిన పెను ప్రమాదం.. విమానంలో 140 మంది ప్రయాణీకులు

సమాచారం అందుకున్న వెంటనే బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. సమాచారం అందుకున్న వెంటనే కోడ పోలీస్‌స్టేషన్‌తోపాటు నాలుగు పోలీస్‌ స్టేషన్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పొగమంచు కారణంగా ట్రక్ డ్రైవర్ ఆటోను దూరం నుంచి చూడకపోవడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ సంఘటన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

కాగా.. త్రీవీల‌ర్ లో ప్ర‌యాణిస్తున్న కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీకి వెళ్తున్నార‌నీ, దాని కోసం వీరు కతిహార్ నుండి రైలు ఏకాల్సి ఉందని సమాచారం. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న NH 81పై రాత్రి 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆటోరిక్షాలో ఉన్నవారంతా చనిపోయారు. ఖేరియా పంచాయతీ పరిధిలోని గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ త్రీవీలర్‌ను అద్దెకు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.