Site icon HashtagU Telugu

Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

6-year-old boy falls into 70-feet borewell in Madhya Pradesh's Rewa; rescue ops underway

6-year-old boy falls into 70-feet borewell in Madhya Pradesh's Rewa; rescue ops underway

Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రేవా జిల్లా(Rewa District)లో ఆరేండ్ల బాలుడు(6 year old boy) బోరు బావిBorewell)లో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్‌వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావి 70 అడుగుల లోతు ఉన్నదని, నిరంతరాయంగా ఆక్సిజన్‌ పంపిస్తున్నామని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

బాలుడు ప్రస్తుతం 6 సెంటీమీటర్ల లోతులో ఉన్నాడని అదనపు ఎస్పీ అనిల్‌ సోంకర్‌ తెలిపారు. పైపు ద్వారా ఆక్సిజన్ లోపలికి సరఫరా చేస్తున్నామన్నారు. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాను కూడా పంపించామని చెప్పారు. అయితే కొన్ని అడ్డంకుల వల్ల అది బాలుడిని చేరుకోలేకపోయిందని వెల్లడించారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నామన్నారు. వారణాసి నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాన్ని రప్పించామని.. త్వరగానే బాలుడిని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు.

Read Also: BRS Chevella Sabha : విజయమే లక్ష్యంగా ఈరోజు చేవెళ్ల లో కేసీఆర్ భారీ బహిరంగ సభ